Raghu Rama Krishna Raju: ఇటు ఏఎన్నార్, అటు నాగార్జున, మధ్యలో రఘురామ... నాటి ఫొటో ఇదిగో!

Raghurama shares a pic on ANR birth anniversary

  • ఏఎన్నార్ జయంతి సందర్భంగా రఘురామ స్పందన
  • ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న వైనం
  • ఏఎన్నార్ కు ఘననివాళి
  • ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారని వెల్లడి

తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్న పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అక్కినేనితో తాను కలిసి ఉన్న ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. రఘురామ ఓ సోఫాలో కూర్చుని ఉండగా, ఆయనకు అటూఇటూ అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు నాగార్జున కూర్చుని ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు.

దీనిపై రఘురామ వ్యాఖ్యానిస్తూ, దిగ్గజ సినీ నటులు, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అని పేర్కొన్నారు. ఆయన పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచే ఉంటారని అన్నారు. 

Raghu Rama Krishna Raju
ANR
Birth Anniversary
Nagarjuna
YSRCP
Tollywood
  • Loading...

More Telugu News