Amir Khan: జంటగా మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్, నాగచైతన్య

- హైదరాబాదులో సందడి చేసిన ఆమిర్‌ఖాన్
- ఆమిర్ తో కలిసి లాల్ సింగ్ చద్ధా చిత్రంలో నటించిన చై
- బేగంపేట ఎయిర్ పోర్టులో మొక్కలు నాటిన హీరోలు
- నేడు లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్
- హాజరైన ఆమిర్‌ఖాన్
బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్‌ఖాన్, టాలీవుడ్ యువ కథనాయకుడు నాగచైతన్య 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ హైదరాబాదులో జంటగా మొక్కలు నాటి తమ పర్యావరణ స్పృహ చాటారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టులో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమాన్ని వారిద్దరూ అభినందించారు. ఈ సందర్భంగా తాను రూపొందించిన వృక్ష వేదం పుస్తకాన్ని ఎంపీ సంతోష్ హీరో ఆమిర్‌ఖాన్ కు బహూకరించారు.

