Saitej: సాయితేజ్ కు వెంటిలేటర్ తొలగించాం: అపోలో వైద్యులు

Saitej latest health bulletin

  • ఈ నెల 10న సాయితేజ్ కు రోడ్డుప్రమాదం
  • తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన హీరో
  • అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ కు సర్జరీ
  • సాయితేజ్ ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారన్న డాక్టర్లు
  • సొంతంగా శ్వాస తీసుకుంటున్నాడని వెల్లడి

ఇటీవల హీరో సాయితేజ్ హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం తెలిసిందే. తొలుత మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయితేజ్ ను, ఆపై జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి సాయితేజ్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అపోలో ఆసుపత్రి వర్గాలు సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా మెడికల్ బులెటిన్ విడుదల చేశాయి.

సాయితేజ్ కు వెంటిలేటర్ తొలగించినట్టు వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని, ఆయన సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు. మరికొన్ని రోజుల పాటు సాయితేజ్ ఆసుపత్రిలోనే ఉంటారని ఆ బులెటిన్ లో వివరించారు.

సాయితేజ్ కు రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరగడంతో అపోలో వైద్యులు శస్త్రచికిత్సతో సరిచేశారు. ఈ నెల 10న జరిగిన ఈ రోడ్డుప్రమాదం మెగా కుటుంబంలోనూ, వారి అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగించింది.

Saitej
Health Bulletin
Apollo Hospitals
Hyderabad
Road Accident
Tollywood
  • Loading...

More Telugu News