Imran Khan: తాలిబన్లతో అమెరికా చర్చలు జరపకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి: ఇమ్రాన్ ఖాన్

Situation could worsen if US doesnt recognise Taliban says PM Imran Khan

  • తాలిబన్ల గుర్తింపు పట్ల అమెరికా పాజిటివ్ గా స్పందించాలి
  • ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ అతి పెద్ద సమస్య
  • బయటి శక్తులతో పోరాటాన్ని ఆఫ్ఘన్ ప్రజలు జీహాద్ గా భావించారు

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లతో అమెరికా చర్చలు జరపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. తాలిబన్ల గుర్తింపుకు సంబంధించి అమెరికా పాజిటివ్ గా స్పందించాలని అన్నారు. రష్యన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం అతి పెద్ద సమస్య ఆప్ఘనిస్థానే అని చెప్పారు .

తాలిబన్లకు పాకిస్థాన్ సహాయం చేసిందనే ఆరోపణలపై ఇమ్రాన్ స్పందిస్తూ... అమెరికా బలగాలపై విజయం సాధించేందుకు పాకిస్థాన్ సహాయం చేసి ఉన్నట్టైతే... అప్పుడు అమెరికా కంటే పాకిస్థానే బలమైనదని అర్థమని అన్నారు. బయటి నుంచి వచ్చిన శక్తులతో పోరాటాన్ని ఆఫ్ఘన్ ప్రజలు జీహాద్ గా భావించారని... గత 20 ఏళ్లలో తాలిబన్లు ఎంతో నేర్చుకున్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా చేసిన యుద్ధానికి తాము మద్దతు పలకలేదని అన్నారు.

  • Loading...

More Telugu News