Pavan Kalyan: 'భీమ్లా నాయక్'లో రానా జోడీ ఖరారు కాలేదట!

Bheemla Nayak movie update

  • షూటింగు దశలో 'భీమ్లా నాయక్'
  • పవన్ పోర్షన్ చాలావరకూ పూర్తి
  • ఇక రానా పోర్షన్ పై పూర్తి దృష్టి  
  • జనవరి 12వ తేదీన విడుదల

పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా 'భీమ్లా నాయక్' రూపొందుతోంది. సితార బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటిస్తున్నాడు. 'హరిహర వీరమల్లు' సెట్స్ పైకి వెళ్లాలి కనుక, ఆయన పోర్షన్ కి సంబంధించిన సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు.

ఇక ఇటీవల విదేశాలకి వెళ్లిన రానా తిరిగిరావడంతో, ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్య మీనన్ నటించింది. రానా జోడిగా ఐశ్వర్య రాజేశ్ పేరు వినిపించింది. కానీ ఇపుడు ఆమె చేయడం లేదని తెలుస్తోంది.

ఐశ్వర్య రాజేశ్ డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో, ఈ పాత్ర కోసం ముగ్గురు కథానాయికలను అనుకున్నారట. ఆ జాబితాలో మాళవిక నాయర్ .. మాళవిక మోహన్ .. సంయుక్త మీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. సంయుక్త మీనన్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News