Ola Scooter: ఓలా స్కూటర్ సరికొత్త రికార్డు.. రెండ్రోజుల్లో ఎంత అమ్మకాలు జరిగాయంటే..!

Ola electric scooter two days online sales create record

  • రూ. 1100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలిపిన ఓలా సీఈవో
  • ట్విట్టర్ వేదికగా వెల్లడించిన భవీష్ అగర్వాల్
  • ఎస్ 1 ధర రూ. లక్ష, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు

రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు రికార్డులు సృష్టించాయి. రెండ్రోజుల పాటు జరిగిన ఈ స్కూటర్ అమ్మకాలు ఈ-కామర్స్ చరిత్రలోనే అధికమని ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. స్కూటర్ విక్రయాలు ప్రారంభించిన తొలిరోజే సుమారు రూ. 600 కోట్ల అమ్మకాలు జరిగాయి.

రెండ్రోజుల సేల్ సెప్టెంబరు 16తో ముగిసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ. 20 వేలు చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకున్నారు. మళ్లీ దీపావళి సందర్భంగా నవంబర్ 1న స్కూటర్ సేల్స్ జరుగుతాయని భవీష్ తెలిపారు. కస్టమర్లు వెంటనే తమ స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పారు.

ఈ విషయాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా భవీష్ వెల్లడించారు. రెండ్రోజుల ఓలా స్కూటర్ సేల్స్ అద్భుతంగా జరిగాయని చెప్పారు. ఓలా నుంచి ఎస్ 1, ఎస్ 1 ప్రో రెండు మోడళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలైన సంగతి తెలిసిందే.

వీటిలో ఎస్ 1 స్కూటర్ ధర రూ. లక్ష రూపాయలు కాగా, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఎలక్ట్రిక్ వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలతో ఈ ధర మరింత తగ్గవచ్చు.

  • Loading...

More Telugu News