Virat Kohli: టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్న కోహ్లీ.. పొట్టి ఫార్మాట్లో విరాట్ రికార్డులపై ఒక లుక్కేద్దామా?

kohli records in T20 cricket

  • 2017లో ధోనీ నుంచి సారధ్య బాధ్యతలు తీసుకున్న కోహ్లీ
  • 12 అర్ధశతకాలతో 1502 పరుగులు
  • ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్సీ

టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ప్రకటించాడు. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో ఈ రికార్డుల వీరుడు ఏం సాధించాడో ఒకసారి పరిశీలిస్తే అద్భుతమైన రికార్డు కనిపిస్తుంది.

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి 2017లో టీ20 సారధ్య బాధ్యతలను కోహ్లీ తీసుకున్నాడు. అప్పటి నుంచి సత్తా చాటుతూనే వచ్చాడు. ఐపీఎల్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. టీమిండియా టీ20 సారధిగా 48.45 సగటుతో 1502 పరుగులు సాధించాడు. వీటిలో 12 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

టీమిండియా సారధిగా..
మ్యాచులు: 45
గెలిచినవి: 27
ఓటములు: 14
టై: 2
ఫలితం తేలనివి: 2
పరుగులు: 1502
అర్ధశతకాలు: 12
సగటు: 48.45
స్ట్రయిక్ రేట్: 143.18

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా..
మ్యాచులు: 132
గెలిచినవి: 60
ఓటములు: 65
ఫలితం తేలనివి: 4

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 రెండో సెషన్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిదే. ఈ నెల 20న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బెంగళూరు తలపడనుంది.

  • Loading...

More Telugu News