Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం పునాది పనుల్లో తొలిదశ పూర్తి

First stage work of Ram Mandir foundation finished

  • వివరాలను వెల్లడించిన ట్రస్ట్ జనరల్ సెక్రటరీ
  • కనీసం వెయ్యేళ్లు నిలిచేలా ఆలయాన్ని నిర్మిస్తున్నామని వివరణ
  • నిర్మాణానికి కేవలం రాళ్లు మాత్రమే వినియోగిస్తున్నామని వెల్లడి

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో చేపట్టిన ఆలయం నిర్మాణం పునాది పనుల్లో తొలి దశ పూర్తయింది. ఈ విషయాన్ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఈరోజు వెల్లడించారు. అయోధ్యలో జరిగిన ఆలిండియా మేయర్స్ కౌన్సిల్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కనీసం వెయ్యేళ్లు నిలిచేలా రామాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణ కార్యక్రమంలో అత్యుత్తమ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్ లు పని చేస్తున్నారని తెలిపారు. నిర్మాణం కోసం కేవలం రాళ్లను మాత్రమే వాడుతున్నామని... ఇనుము, ఉక్కు వాడటం లేదని... ఇదొక ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పారు. రామ జన్మభూమి కోసం జరిగిన ఉద్యమం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని అన్నారు.

Ayodhya Ram Mandir
Foundation
First Stage
  • Loading...

More Telugu News