Telangana: ప్రభుత్వం ఇచ్చిన రూ.20 లక్షల సాయాన్ని తిరస్కరించిన సైదాబాద్​ చిన్నారి తండ్రి

Saidabad Victim Family Refused To Take Financial Aid From Govt

  • పరామర్శించి చెక్కును అందజేసిన మంత్రులు అలీ, సత్యవతి రాథోడ్
  • చెక్కును అక్కడ పెట్టి వెళ్లారన్న బాలిక తండ్రి
  • మరో రూ.20 లక్షలు ఇచ్చినా తీసుకోబోమని వెల్లడి

ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయాన్ని సైదాబాద్ లో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులు తిరస్కరించారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలకు ముందు.. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ లు చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఆర్థిక సాయం కింద రూ.20 లక్షల చెక్కును వారికి ఇచ్చారు. అయితే, ఆ చెక్కును బాలిక తండ్రి తిరస్కరించారు.

ఆ ఆర్థిక సాయం తమకు అవసరం లేదని, చెక్కును వెనక్కు ఇచ్చేస్తామని చెప్పారు. మంత్రులు ఆ చెక్కును అక్కడ పెట్టి వెళ్లిపోయారని, తమకు డబ్బు అక్కర్లేదని, న్యాయం కావాలని డిమాండ్ చేశారు. మరో రూ.20 లక్షలు ఇచ్చినా తీసుకోబోమన్నారు.

  • Loading...

More Telugu News