TTD: పూర్తయిన టీటీడీ నూతన పాలకమండలి నియామక ప్రక్రియ.. కొత్త సభ్యులు వీరే

TTD Board new Governing Body elected

  • 24 మందితో కొలువుదీరిన నూతన పాలకవర్గం
  • ఎక్స్ అఫీషియో సభ్యులుగా రెవెన్యూ కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ తదితరులు
  • ప్రత్యేక ఆహ్వానితుడిగా తిరుపతి ఎమ్మెల్యే భూమన

24 మంది సభ్యులతో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి ఏర్పాటైంది. ఈ మేరకు కొత్త సభ్యుల జాబితాను టీటీడీ విడుదల చేసింది. దీని ప్రకారం.. పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి (ఎమ్మెల్యే), టంగుటూరు మారుతి ప్రసాద్, బుర్రా మధుసూదన్ యాదవ్ (ఎమ్మెల్యే), కలివేటి సంజీవయ్య (ఎమ్మెల్యే), డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మన్నె జీవన్‌రెడ్డి, బుదాటి లక్ష్మీనారాయణ, పార్థసారథిరెడ్డి, మురంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (ఎమ్మెల్యే), శ్రీనివాసన్, నందన్‌కుమార్, శశిధర్, విశ్వనాథ్‌రెడ్డి, మిలింద్, సౌరభ్, కేతన్ దేశాయ్, రాజేశ్ శర్మ, సనత్ కుమార్, అల్లూరు మల్లీశ్వరి, ఎస్.శంకర్ పాలకమండలి సభ్యులుగా నియమితులయ్యారు.

రెవెన్యూశాఖ కార్యదర్శి (దేవాదాయ), దేవాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు.

TTD
Tirumala
Tirupati
TTD Board
  • Loading...

More Telugu News