Nara Lokesh: తండ్రీకొడుకులు బాలికలపై అత్యాచారానికి తెగబడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది: నారా లోకేశ్

Nara Lokesh comments on AP govt

  • విశాఖ జిల్లాలో ఘటన
  • మైనర్ బాలికలపై అత్యాచారం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు
  • తండ్రి, కొడుకుపై పోక్సో చట్టం కింద కేసు
  • అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిందన్న లోకేశ్

విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఓ తండ్రి, కొడుకు ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ వచ్చిన వార్త పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. విశాఖ జిల్లాలో తండ్రీకొడుకులు మృగాళ్లలా మారి బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని వ్యాఖ్యానించారు. బాధితులే నిందితుల్ని గుర్తించాలనే మహిళా హోంమంత్రి సుచరిత అసమర్థ వ్యాఖ్యలకు తోడు, కనీసం ఒక్క ఘటనలో కూడా నిందితులకు శిక్ష పడకపోవడం వల్లే కామోన్మాదులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని లోకేశ్ విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఆడబిడ్డల్ని బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాల కోసం పోలీసులను వాడుకోవడం మానేస్తే, కనీసం వాళ్లు నిందితులనైనా పట్టుకుంటారని లోకేశ్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News