Raghu Rama Krishna Raju: కోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందే వార్త ప్రచురించారని 'సాక్షి'పై రఘురామ పిటిషన్... తీర్పు రేపటికి వాయిదా

CBI court adjourned verdict in Raghurama petition
  • జగన్ బెయిల్ రద్దు కోరుతూ గతంలో రఘురామ పిటిషన్
  • ఆ పిటిషన్ ను కొట్టివేశారని సాక్షిలో వార్త!
  • ఇది కోర్టు ధిక్కరణ అంటూ రఘురామ ఆరోపణ
  • సాక్షిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
జగన్ బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేశారంటూ ఇటీవల సాక్షిలో వార్త వచ్చిందంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందే వార్త ప్రచురించారంటూ రఘురామ హైదరాబాదు సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ రఘురామ తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టు నేడు విచారణ చేపట్టగా, వాదనలు ముగిశాయి. సీబీఐ న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
Raghu Rama Krishna Raju
CBI Court
Petition
Jagan Bail

More Telugu News