Virat Kohli: ఐదో టెస్టు రద్దు కావడంపై కోహ్లీ స్పందన

Virat Kohli response on 5th test cancellation

  • కరోనా కేసుల నేపథ్యంలో ఆగిపోయిన ఐదో టెస్టు
  • దురదృష్టకరమన్న విరాట్ కోహ్లీ
  • యూఏఈలో అయినా బలమైన బయోబబుల్ ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కోహ్లీ

ఇంగ్లండ్ తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ ఊహించని విధంగా రద్దయిన సంగతి తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్ రద్దయింది. చివరి టెస్ట్ రద్దు కావడంతో మన ప్లేయర్లందరూ లండన్ నుంచి యూఏఈకి వచ్చేశారు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ లో వీరు ఆడనున్నాయి.

మరోవైపు ఐదో టెస్టు రద్దుపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, మ్యాచ్ ఆగిపోవడం దురదృష్టకరమని చెప్పాడు. యూఏఈలో అయినా బలమైన బయోబబుల్, సురక్షితమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు.

ఇంకోవైపు ఐదో టెస్టు రద్దు కావడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది. దీని వల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోతామని చెప్పింది. ఈ మ్యాచ్ పై చర్చించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ లండన్ కు వెళ్లనున్నారు. అయితే, ఆగిపోయిన టెస్టు మ్యాచును మాత్రమే తర్వాత కొనసాగించాలని... ప్రస్తుత సిరీస్ లో భాగంగానే ఆ మ్యాచ్ జరగాలని గంగూలీ చెప్పారు. మరో సిరీస్ అంటే మాత్రం కుదరదని ఆయన స్పష్టం చేశారు.

Virat Kohli
Team India
England
5th Test
  • Loading...

More Telugu News