Vijayashanti: సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన వ్యక్తి సాయిధరమ్ తేజ్: విజయశాంతి

Sai Dharam Tej is a good person says Vijayashanti
  • సాయితేజ్ చాలా మంచివాడు
  • మంచి టాలెంట్ ఉన్న నటుడు  
  • సాయితేజ్ త్వరగా కోలుకోవాలి
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం టాలీవుడ్ ను షేక్ చేసింది. సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి కూడా వెళ్లారు.

తాజాగా సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాయి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సాయితేజ్ చాలా మంచి వ్యక్తి అని కితాబునిచ్చారు. మంచి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. మంచి టాలెంట్ ఉన్న నటుడని అన్నారు. సాయితేజ్ త్వరగా కోలుకుని, ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.
Vijayashanti
BJP
Sai Dharam Tej
Tollywood

More Telugu News