Sai Dharam Tej: నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

Second health bulletin of actor Sai Dharam Tej

  • ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది
  • ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయి
  • ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తాం

సినీ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ క్రమంలో అపోలో ఆసుపత్రి సాయిధరమ్ కు చెందిన తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.

సాయిధరమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని... ఆయన శరీర ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్టు చెప్పారు. రేపు మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని తెలిపారు.

మరోవైపు అపోలో ఆసుపత్రికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Sai Dharam Tej
Tollywood
Road Accident
Health Bulletin
  • Loading...

More Telugu News