International Space Station: విద్యుత్ దీపాలు, నక్షత్రాల మధ్య వెలుగుల పోటీ!.. ఫొటో తీసిన ఫ్రెంచి వ్యోమగామి

French Astronaut captures breathtaking image of earth from ISS

  • భూమి చుట్టూ రంగుల దుప్పటిలా వాయువులు
  • ఐఎస్ఎస్ నుంచి కనిపిస్తున్న రమణీయ దృశ్యం
  • ఫొటో తీసిన థామస్ పెస్కెట్ అనే ఫ్రెంచి వ్యోమగామి

భూమిపై రంగు రంగుల దుప్పటి కప్పారా? అనేట్టు ఉన్న ఈ ఫొటోను ఫ్రెంచి వ్యోమగామి థామస్ పెస్కెట్ క్లిక్‌మనిపించారు. నాసా ఎక్స్‌పెడిషన్ 65 బృందంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఆయన ప్రస్తుతం ఉన్నారు. అక్కడి నుంచి భూమిపై విద్యుత్ దీపాలు, అంతరిక్షంలోని నక్షత్రాలు, మధ్యలో భూమి అంచు కనిపించేలా అత్యంత సుందరమైన దృశ్యాన్ని ఆయన ఫొటో తీశారు.

ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన థామస్.. ‘‘కొన్నిసార్లు అంతరిక్షంలోని నక్షత్రాలు, భూమిపై ఉండే విద్యుత్ దీపాలు.. ఏవి ఎక్కువగా కాంతివంతంగా, అందంగా మెరుస్తున్నాయని పోటీ పడుతుంటాయి’’ అంటూ ఒక పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

భూ వాతావరణంలో 75 కిలోమీటర్ల ఎత్తున సోడియం పొర వెలుగులు కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లోనే కనిపిస్తాయట. సూర్యుడు, నక్షత్రాల కాంతి, రేడియేషన్ వల్ల ఈ పొర నారింజ రంగులో మెరుస్తుంది.

ఈ పొరపైనే చాలా పల్చగా ఆకుపచ్చ రంగు పొర కూడా కనిపిస్తోంది. ఆక్సిజన్ అయాన్లతో కూడిన పొరపై సూర్యుడి రేడియేషన్ పడటంతో ఇలా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ చిత్రం మాత్రం అంతరిక్ష ఔత్సాహికులకు తెగనచ్చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News