Air Strip: హైవేపై ప్రయోగాత్మకంగా ల్యాండింగ్... విమానంలో రాజ్ నాథ్, గడ్కరీ!
- దేశవ్యాప్తంగా హైవేలపై ఎయిర్ స్ట్రిప్ ల నిర్మాణం
- అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి ఎయిర్ స్ట్రిప్ లు
- రాజస్థాన్ లోని బాద్మేర్ హైవే ఎయిర్ స్ట్రిప్ ప్రారంభోత్సవం
- పాల్గొన్న గడ్కరీ, రాజ్ నాథ్
దేశంలో అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జాతీయ రహదారులపై ఎయిర్ స్ట్రిప్ లు నిర్మిస్తుండడం తెలిసిందే. వీటి నిర్మాణం దాదాపుగా పూర్తికావొస్తోంది. రాజస్థాన్ లోని బాద్మేర్ వద్ద జాతీయ రహదారి (925ఏ)పైనా ఈ అత్యవసర రన్ వే నిర్మించారు. ఈ ఎయిర్ స్ట్రిప్ ప్రారంభోత్సవానికి కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో, భారత వాయుసేనకు చెందిన సి-130జే రవాణా విమానాన్ని బాద్మేర్ హైవేపై ప్రయోగాత్మకంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరులు ప్రయాణించారు. అంతకుముందు ఓ యుద్ధ విమానం సైతం ఈ హైవే ఎయిర్ స్ట్రిప్ పై విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ లను ప్రదర్శించింది.