Ritu Varma: పల్లెటూరి వాతావరణం తెలియకపోయినా గుమ్మడి వరలక్ష్మి పాత్ర చేశాను: రీతూ వర్మ

Tuck Jagadish movie update

  • ఈ కథ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది
  • ఎక్కడా ఓవర్ యాక్షన్లు ఉండవు
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరవుతాను
  • నానీతో కలిసి మళ్లీ నటించాలనుందన్న రీతూ వర్మ    

తెలుగు తెరపై పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా కనిపించే కథానాయికలలో రీతూ వర్మ ఒకరు. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'టక్ జగదీష్' ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, 'గుమ్మడి వరలక్ష్మి' పాత్రలో రీతూ వర్మ కనిపించనుంది.

తాజా ఇంటర్వ్యూలో రీతూ వర్మ మాట్లాడుతూ .. "ఈ సినిమా కథ అంతా కూడా పల్లెటూళ్లో నడుస్తుంది. నాకు పల్లె వాతావరణం .. అక్కడి పద్ధతులు తెలియవు. అయినా దర్శకుడు శివ నిర్వాణ ఇచ్చిన సూచనలు పాటిస్తూ నా పాత్రను చేయగలిగాను. అందులో నాని సహకారం కూడా ఎంతో ఉంది.

ఈ సినిమా కథ వాస్తవానికి చాలా దగ్గరగా నడుస్తుంది. ఓవర్ యాక్షన్లు .. అతిగా అనిపించే డ్రామాలు ఉండవు. ఈ సినిమాతో నేను ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువవుతానని అనుకుంటున్నాను. మరోసారి నానీతో కలిసి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.  

Ritu Varma
Nani
Jagapathi Babu
  • Loading...

More Telugu News