Taliban: ఆఫ్ఘన్ దేశాధినేతగా ముల్లా హసన్ అఖుంద్, ఉపాధ్యక్షుడిగా బరాదర్... తాలిబన్ మంత్రివర్గం ఇదే!

Taliban announces cabinet ministers

  • ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక పరిణామం
  • దేశాధినేత సహా కీలక మంత్రిత్వశాఖల ప్రకటన
  • త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటు
  • తాలిబన్ ముఖ్యులకు తాత్కాలిక మంత్రి పదవులు

ఎట్టకేలకు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు పడింది. రాజధాని కాబూల్ ను ఆక్రమించుకున్నాక తాలిబన్ల దృష్టి తమకు లొంగని పంజ్ షీర్ ప్రావిన్స్ పై పడింది. పంజ్ షీర్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయంపై తమ జెండా ఎగురవేసిన అనంతరం తాలిబన్లు తమ మంత్రి వర్గాన్ని ప్రకటించారు. తాలిబన్ సుప్రీం లీడర్ ముల్లా హసన్ అఖుంద్ ఆఫ్ఘన్ దేశాధినేతగా వ్యవహరిస్తారు.

ఉపాధ్యక్షుడు-1గా ముల్లా బరాదర్, ఉపాధ్యక్షుడు-2గా మలావీ హనాఫీ నియమితులయ్యారు. ఇక తాత్కాలిక రక్షణ మంత్రిగా ముల్లా యాకూబ్, తాత్కాలిక హోంమంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీ, తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా అమీర్ ముత్తాఖీ, తాత్కాలిక ఆర్థికమంత్రిగా ముల్లా హిదాయతుల్లా బద్రీ, తాత్కాలిక విద్యాశాఖ మంత్రిగా షేక్ మలావీ నూరుల్లా వ్యవహరిస్తారు. అంతేకాదు, న్యాయశాఖ, ఐటీ శాఖ వంటి ఇతర కీలక రంగాలకు కూడా తాత్కాలిక మంత్రులను ప్రకటించారు. తాలిబన్లు తాజా మంత్రివర్గంతో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధికారికంగా కార్యకలాపాలు సాగించనున్నారు.

కాగా, తాలిబన్ మంత్రుల్లో సిరాజుద్దీన్ హక్కానీతో పాటు పలువురు అమెరికా ఉగ్రవాద హిట్ లిస్టులో ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News