Hindustan Unilever Limited: మరింత ప్రియం కానున్న సర్ఫ్ ఎక్సెల్, రిన్, లక్స్ ధరలు

Hindustan Unilever hikes prices

  • ధరలు పెంచిన హిందూస్థాన్ యూనిలీవర్
  • కొన్నింటిపై భారీగా ధరల పెంపు
  • సర్ఫ్ చిన్న ప్యాకెట్ల పరిమాణం తగ్గింపు
  • వాణిజ్యంపై ద్రవ్యోల్బణం ప్రభావం

భారత్ లో సబ్బులు, డిటర్జెంట్ల ధరలు మరింత పెరగనున్నాయి. హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్ యుఎల్) తన ఉత్పత్తుల ధరలు పెంచింది. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ డిటర్జెంట్, లక్స్ వంటి ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్టు వెల్లడించింది. వీల్ డిటర్జెంట్ కిలో, అరకిలో ప్యాక్ లపై 3.5 శాతం పెంచనుంది. అటు, ఇప్పటివరకు కిలో రూ.77లకు లభించిన రిన్ డిటర్జెంట్ పౌడర్ ఇకపై రూ.82 పలకనుంది.

అంతేకాదు, 150 గ్రాముల చిన్న ప్యాక్ లను 130 గ్రాములకు కుదించింది. ఇక, అత్యధికంగా అమ్ముడయ్యే సర్ఫ్ ఎక్సెల్ పై ఏకంగా రూ.14 పెంచారు. సౌందర్యం కోసం ఉపయోగించే లక్స్ సబ్బుల ధర గరిష్ఠంగా 12 శాతం పెరిగింది. అధిక ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగానే హిందూస్థాన్ యూనిలీవర్ సంస్థ ధరలు పెంచినట్టు తెలుస్తోంది. 20 ఏళ్ల గరిష్ఠానికి ముడిసరుకుల ధరలు పెరగడం కూడా తాజా ధరల పెంపునకు కారణంగా భావిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News