Kodali Nani: ఏపీలో అడ్రస్ లేని బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది: కొడాలి నాని

Kodali Nani fires on BJP

  • ఏపీలో వినాయకచవితిపై ఆంక్షలు
  • ఆందోళనలు చేపడుతున్న బీజేపీ
  • రాజకీయ లబ్దికోసమేనంటూ నాని ఆగ్రహం
  • సీఎంకు అన్ని మతాలు సమానమేనని వెల్లడి

ఏపీలో వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ బీజేపీ ఆందోళనలు చేపడుతోంది. దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీలో అడ్రస్ లేని బీజేపీ విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వినాయకచవితిపై ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో, ఏపీలోనూ అవే ఆంక్షలు అమలు చేస్తున్నామని నాని స్పష్టం చేశారు.

సోము వీర్రాజుకు విగ్రహాలతోనూ, వినాయకచవితితోనూ రాజకీయం చేయడం మామూలేనని అన్నారు. సీఎం జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని ఉద్ఘాటించారు. వినాయకచవితి పండుగపై బీజేపీ, టీడీపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని మంత్రి విమర్శించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News