Gutta Jwala: అంగరంగ వైభవంగా గుత్తా జ్వాల వివాహం.. వీడియో ఇదిగో!

Gutta Jwala marriage video going viral
  • సినీ హీరో విష్ణు విశాల్ ను పెళ్లాడిన గుత్తా జ్వాల
  • ఏప్రిల్ 2న అంగరంగ వైభవంగా వివాహం
  • ఈరోజు జ్వాల పుట్టినరోజు సందర్భంగా వీడియో షేర్ చేసి విష్ణు
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తమిళ సినీ హీరో విష్ణు విశాల్ ను ఆమె పెళ్లాడింది. ఈ ఏప్రిల్ 2న వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. తక్కువ మంది మాత్రమే పెళ్లికి హాజరైనా... పెళ్లి వేడుక మాత్రం వైభవంగా జరిగింది.

తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను విష్ణు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈరోజు గుత్తా జ్వాల పుట్టిన రోజు. తన భార్య జన్మదినం సందర్భంగా వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, వివాహ వేడుక, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి. రిసెప్షన్ లో యావత్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా స్పెప్పులు వేయడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Gutta Jwala
Vishnu Vishal
Marriage
Video

More Telugu News