Mukhesh Ambani: చీరల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ముఖేశ్ అంబానీ

Mukhesh Ambani to enter into sarees business

  • 'అవంత్రా' పేరుతో స్టోర్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్
  • తొలి స్టోర్ ను బెంగళూరులో ఏర్పాటు చేయనున్న రిలయన్స్
  • నల్లీ సిల్క్స్, పోతీస్ వంటి సంస్థలతో భాగస్వామ్యం

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రతి రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చీరల వ్యాపారంలోకి కూడా ఆయన అడుగుపెట్టబోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రీటైల్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతోంది. చీరలతో పాటు భారతీయ సంప్రదాయ దుస్తుల అమ్మకాల కోసం 'అవంత్రా' బ్రాండ్ నేమ్ తో స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ పండుగ సీజన్ లోనే బెంగళూరులో తొలి స్టోర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఏపీలో స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.  

ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్ కు పోటీగా ఈ వ్యాపారాన్ని ముఖేశ్ అంబానీ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. తనిష్క్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ సంస్థలు కూడా త్వరలోనే సంప్రదాయ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. అవంత్రా తన సొంత బ్రాండ్ దుస్తులతో పాటు నల్లీ సిల్క్స్, పోతీస్ వంటి ఇతర బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనుంది. అంతేకాదు, ఆయా ప్రాంతాల్లోని నేత కార్మికులతో ఒప్పందం చేసుకోనుంది.

  • Loading...

More Telugu News