Mahesh Babu: త్రివిక్రమ్ సినిమా విషయంలో ప్లానింగ్ మార్చిన మహేశ్!

Trivikram and Mahesh Babu movie update
  • మహేశ్ ప్లానింగులో మార్పు
  • 'సర్కారువారి పాట' పూర్తి చేయడంపై దృష్టి
  • దసరాకి లాంఛనంగా మొదలు  
  • నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్  
త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాను చేస్తున్న మహేశ్ బాబు, దాంతో పాటుగా త్రివిక్రమ్ సినిమా కూడా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ మహేశ్ బాబు మనసు మార్చుకున్నాడట. కరోనా కారణంగా ఇప్పటికే 'సర్కారువారి పాట' షూటింగు పరంగా ఆలస్యమైంది. మళ్లీ ఆ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చి, త్రివిక్రమ్ సినిమా చేయడం వలన మరికాస్త ఆలస్యమవుతుంది. అందువలన ముందుగా 'సర్కారువారి పాట' షూటింగును పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.

త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాను దసరా పండుగ రోజున లాంఛనంగా ప్రారంభించి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ జోడీగా పూజ హెగ్డే - నభా నటేశ్ అలరించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Mahesh Babu
Pooja Hegde
Nabha Natesh

More Telugu News