Vijay Devarakonda: 'పాట' మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda gives chance to Shanmukha Priya

  • లైగర్‌లో షణ్ముఖ ప్రియకు పాడే అవకాశం
  • ఆమెను కలిసిన ఫొటోలు షేర్ చేసిన హీరో
  • త్వరలోనే ఆమె పాడిన పాట విడుదల?

హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘ఇండియన్ ఐడల్ సీజన్ 12’లో అద్భుతంగా రాణించిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకు తన ‘లైగర్’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. షణ్ముఖ ప్రియను కలిసిన ఫొటోలను షేర్ చేశాడు.

ఇండియన్ ఐడల్‌లో ఆమె ట్యాలెంట్ చూసి ముచ్చటపడిన విజయ్.. ‘‘నువ్వు ఇండియన్ ఐడల్‌లో గెలిచినా ఓడినా.. నేను హైదరాబాద్ వచ్చాక మనం కలుస్తాం. నువ్వు నా సినిమాలో పాడతావ్. ఇది డీల్’’ అంటూ ఒక వీడియో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో షణ్ముఖ ప్రియ చేత ఒక పాట పాడించారు. ఈ పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం.

Vijay Devarakonda
Liger
Puri Jagannadh
Shanmukha Priya
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News