Atlee Kumar: అట్లీకుమార్ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం!

Atlee Kumar movie update

  • విజయ్ కి వరుస హిట్లు ఇచ్చిన డైరెక్టర్
  • తమిళనాట మాస్ డైరెక్టర్ గా క్రేజ్
  • షారుఖ్, నయనతార జంటగా హిందీ సినిమా  
  • ఈ నెల 13 నుంచి షూటింగ్ మొదలు 

తమిళనాట అట్లీ కుమార్ కి మంచి క్రేజ్ వుంది. మాస్ కంటెంట్ తో కూడిన కథలను ఎంచుకుంటూ .. వాళ్లను మెప్పిస్తూ వెళుతున్నాడు. విజయ్ కి వరుసగా భారీ విజయాలను ముట్టజెబుతూ, చాలా తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఆ తరువాత మురుగదాస్ మాదిరిగా ఆయన బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు.

ఏకంగా షారుఖ్ ఖాన్ కి కథ వినిపించి, ఆయనతో ఓకే అనిపించుకున్నాడు. కథల విషయంలో ఒక పట్టాన తేల్చని షారుఖ్, అనేక మార్పులు .. చేర్పులు చెప్పాడట. అయినా ఆయనకి నచ్చిన విధంగా అట్లీ కుమార్ ఈ కథను సిద్ధం చేశాడని అంటున్నారు. అలా మొత్తానికి రెండేళ్లుగా జరుగుతున్న ప్రయత్నం ఫలించి, ఈ నెల 13వ తేదీన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

10 రోజుల పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. ఆయన జోడీగా నయనతార నటిస్తుండటం విశేషం. గతంలో అట్లీ దర్శకత్వంలో ఆమె 'రాజా రాణి' సినిమా చేసింది. అయితే ఇన్నేళ్ల తన కెరియర్లో బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెప్పేసిన నయనతార, ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం విశేషం.

Atlee Kumar
Shahrukh Khan
Bollywood
  • Loading...

More Telugu News