Bandla Ganesh: టీవీ డిబేట్ మధ్యలో జీవిత ఫోన్ కాల్... తాను మాట్లాడనన్న బండ్ల గణేశ్ 

Bandla Ganesh refuse to talk with Jeevitha in a tv channel live

  • 'మా' ఎన్నికల్లో ఊహించని పరిణామం
  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్
  • జీవిత రాకతో బండ్ల గణేశ్ అలక!
  • చానల్ డిబేట్ కు వచ్చిన బండ్ల గణేశ్
  • జీవిత తనకు అక్క వంటిదని వ్యాఖ్య  

మా ఎన్నికల వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకోవడం ద్వారా బండ్ల గణేశ్ కలకలం రేపారు. జీవితను ప్రకాశ్ రాజ్ ప్యానెల్లోకి తీసుకోవడమే బండ్ల గణేశ్ నిష్క్రమణకు కారణమని తెలుస్తోంది. కాగా, ఓ టీవీ చర్చా కార్యక్రమానికి బండ్ల గణేశ్ హాజరు కాగా, ఆ డిబేట్ మధ్యలో జీవిత ఫోన్ లైన్ లోకి వచ్చారు. అయితే, ఆమెతో తాను మాట్లాడనంటే మాట్లాడనని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. యాంకర్ ఎంత నచ్చచెప్పేందుకు యత్నించినా బండ్ల గణేశ్ తన పంతం వీడలేదు. లైవ్ లో కూర్చుంటా కానీ, నేను మాట్లాడను అంటూ తేల్చి చెప్పారు.

చివరికి ఆ యాంకర్ "నేను ఆమెతో మాట్లాడతాను, మీరు మైక్ పెట్టుకోండి" అంటూ సూచించారు. ఇంతలో జీవిత మాట్లాడడం ప్రారంభించారు. ఆపై బండ్ల గణేశ్ అందుకుని, జీవిత తనకు అక్క వంటిదని స్పష్టం చేశారు. తమ మధ్య వివాదాలు ఏమీ లేవని వెల్లడించారు.

గతంలో మా కార్యవర్గంలో ఉన్నవాళ్లే మళ్లీ పోటీ చేస్తుండడం పట్ల బండ్ల గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బండ్ల గణేశ్ అంటున్నారని యాంకర్ జీవితకు చెప్పారు. అందుకు జీవిత బదులిస్తూ అనేక పరిస్థితుల కారణంగా అభివృద్ధి సాధ్యం కాలేదని వివరణ ఇచ్చారు. ఆ పరిస్థితులు ఏంటన్నది అందరికీ తెలిసిందేనని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News