Pawan Kalyan: ఆమదాలవలస దాడి ఘటనపై పవన్ కల్యాణ్ సమీక్ష
- రోడ్ల దుస్థితిపై జనసేన నిరసనలు
- ఆమదాలవలసలో జనసైనికులపై దాడి
- వైసీపీ నేతలపై జనసేన వర్గాల ఆగ్రహం
- బాధితులకు స్వయంగా ఫోన్ చేసిన పవన్
ఏపీలో రహదారుల పరిస్థితిపై జనసేన నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో రోడ్ల దుస్థితిపై విన్నవించిన జనసేన స్థానిక నేత రామ్మోహనరావుపైనా, ఇతర జనసేన కార్యకర్తలపైనా వైసీపీ వాళ్లు దాడి చేశారని జనసేన వర్గాలు వెల్లడించాయి. తమ పార్టీకి చెందిన వారు గాయపడ్డారని తెలిపాయి. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా సమీక్షించారు.
దాడిలో గాయపడిన రామ్మోహనరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. రామ్మోహనరావును అడిగి ఆమదాలవలస రోడ్ల పరిస్థితులను, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అనకాపల్లి నేతలతోనూ పవన్ ఫోన్ లో మాట్లాడారు. అనకాపల్లిలో పరిస్థితులపై ఆరా తీశారు.