Team India: పంత్, శార్దూల్ పోరాటం... మ్యాచ్ ను శాసించే స్థితిలో భారత్

Team India in strong position in fourth test
  • లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • రెండో ఇన్నింగ్స్ లో భారీస్కోరు దిశగా భారత్
  • 130 ఓవర్లలో 6 వికెట్లకు 375 రన్స్
  • ప్రస్తుతం భారత్ ఆధిక్యం 276 పరుగులు
నాలుగో టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 6 వికెట్లకు 375 పరుగులు చేసింది. దాంతో భారత్ ఆధిక్యం 276 పరుగులకు చేరింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (37 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్ (36 బ్యాటింగ్) ఉన్నారు. ఓ దశలో భారత్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (17), రహానే (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (44) వెనుదిరిగారు. ఈ దశలో మరికొన్ని వికెట్లు పడితే భారత్ కష్టాల్లో పడేది. అయితే, పంత్, శార్దూల్ జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడడమే కాకుండా, స్కోరుబోర్డును ముందుకు ఉరికించారు.
Team India
Fourth Test
England
Rishabh Pant
Shardul Thakur

More Telugu News