Fake Corona Vaccines: నకిలీ కరోనా వ్యాక్సిన్లపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం

Union govt alerts states over fake corona vaccines

  • అంతర్జాతీయ మార్కెట్లో కొవిషీల్డ్ ఫేక్ వ్యాక్సిన్లు
  • ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
  • రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం
  • నకిలీల గుర్తింపునకు మార్గదర్శకాలు

అంతర్జాతీయ మార్కెట్లో నకిలీ కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు చలామణీలో ఉన్నాయంటూ వస్తున్న కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నకిలీ కరోనా వ్యాక్సిన్లపై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నకిలీ వ్యాక్సిన్, ఒరిజినల్ వ్యాక్సిన్ల మధ్య తేడాలను గుర్తించడంపై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్ పై ఉన్న లేబుల్, రంగు, ఇతర వివరాల ద్వారా ఫేక్ వ్యాక్సిన్లను గుర్తించవచ్చని రాష్ట్రాలకు వివరించింది.

ప్రస్తుతం భారత్ లో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటికి సంబంధించి అసలైన వ్యాక్సిన్లను గుర్తించడంపై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దేశంలో నకిలీ వ్యాక్సిన్లను గుర్తించేందుకు విచారణ చేపట్టినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి ముఖేశ్ మాండవీయ వెల్లడించారు.

  • Loading...

More Telugu News