Rain: హైదరాబాదులో మరోసారి కుండపోత వాన... నీటమునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి

Huge rain lashes Hyderabad city again
  • ఉప్పొంగుతున్న మూసీ నది
  • నదిలోకి వరద నీటి విడుదల
  • రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ
  • అంబర్ పేట్-మూసారాంబాగ్ మార్గంలో నిలిచిన రాకపోకలు
హైదరాబాదు నగరం మరోసారి కుండపోత వానతో అతలాకుతలమైంది. ఈ సాయంత్రం కురిసిన అతి భారీ వర్షానికి నగరం జలమయమైంది. ఈ క్రమంలో మూసీ నదిలోకి వరద నీటిని విడుదల చేయడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. దాంతో అంబర్ పేట-మూసారాంబాగ్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

గత కొన్నిరోజులుగా మూసీ నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చాదర్ ఘాట్, పురానాపూల్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట్, శంకర్ నగర్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
Rain
Hyderabad
Musi River
Musarambhag Bridge

More Telugu News