India: నాలుగో టెస్టు: ఇంగ్లండ్ కు దీటుగా బదులిస్తున్న టీమిండియా

India second innings in fourth test

  • లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • రెండో ఇన్నింగ్స్ లో భారత్ 83/1
  • 46 పరుగులు చేసిన కేఎల్ రాహుల్
  • క్రీజులో రోహిత్, పుజారా

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ కు 99 పరుగుల ఆధిక్యం లభించగా, ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. కోహ్లీ సేన ఇంకా 16 పరుగులు వెనుకబడి ఉంది. 46 పరుగులు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (36 బ్యాటింగ్), ఛటేశ్వర్ పుజారా (0 బ్యాటింగ్) ఉన్నారు. కేఎల్ రాహుల్ వికెట్ ఆండర్సన్ కు దక్కింది.

లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేసింది.

India
Second Innings
Fourth Test
England
  • Loading...

More Telugu News