Allu Arjun: వినాయకచవితికి 'పుష్ప' సెకండ్ సింగిల్ ఉన్నట్టే!

Pushpa movie update

  • ముగింపు దశలో 'పుష్ప'
  • ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్
  • సెకండ్ సింగిల్ కి సన్నాహాలు
  • క్రిస్మస్ కి సినిమా విడుదల  

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో షూటింగు జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా, చివరి షెడ్యూల్ ను మారేడుమిల్లి ఫారెస్టులో జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ముఖ్యంగా ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగనుంది. ఆ తరువాత మిగతా పనులను పూర్తిచేసి, క్రిస్మస్ కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక రెండవ సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వినాయక చవితికి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  

Allu Arjun
Rashmika Mandanna
Aishwarya Rajesh
  • Loading...

More Telugu News