Nabha Natesh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Nabha Natesh as second heroine for Mahesh Babu

  • మహేశ్ బాబు సినిమాలో నభా నటేష్
  • తెలుగు సినిమాలో బాలీవుడ్ నటుడు
  • 'కార్తికేయ 2' హక్కులకు మంచి రేటు    

*  తాజాగా నితిన్ సరసన 'మాస్ట్రో' సినిమాలో నటించిన కథానాయిక నభా నటేష్ కి మహేశ్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందే సినిమాలో నభా నటేష్ ను సెకండ్ హీరోయిన్ పాత్రకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాన కథానాయికగా పూజ హెగ్డే నటిస్తుంది.
*  'రంగ్ దే బసంత్', '3 ఇడియట్స్' వంటి హిందీ సినిమాలలో నటించి పేరుతెచ్చుకున్న బాలీవుడ్ నటుడు శర్మన్ జోషి తాజాగా ఓ తెలుగు సినిమాలో హీరోగా నటించనున్నాడు. శ్రియ కథానాయికగా పాపారావు బియ్యాల దర్శకత్వంలో రూపొందే 'మ్యూజిక్ స్కూల్' సినిమాలో శర్మన్ జోషి కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 15న మొదలవుతుంది.
*  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ వర్గాలలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రం శాటిలైట్, డబ్బింగ్ హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.

Nabha Natesh
Mahesh Babu
Sharman Joshi
Nikhil
  • Loading...

More Telugu News