వైఎస్ రాజశేఖరరెడ్డి 60 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అభిమాని!
- చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వీరాభిమాని
- వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ
- తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యంత ఎత్తయిన వైఎస్ఆర్ విగ్రహం
పలమనేరు సమీపంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విగ్రహం ఏర్పాటు చేయడంపై రెండు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.