Sensex: 58 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్

Sensex crosses 58k mark

  • 277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 89 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 58 వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 58,130కి ఎగబాకింది. నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 17,324కు చేరుకుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (4.12%), టైటాన్ కంపెనీ (2.59%), టాటా స్టీల్ (1.27%), బజాజ్ ఆటో (1.18%), మారుతి సుజుకి (1.06%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.18%), భారతి ఎయిర్ టెల్ (-1.17%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.85%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.67%).

  • Loading...

More Telugu News