Ajith Kumar: రష్యా అందాలను బైక్ పై చుట్టిరానున్న అజిత్!

valimai movie update

  • రష్యాలో అజిత్ 'వలిమై' షూటింగ్ 
  • తాజాగా పూర్తయిన షెడ్యూల్ 
  • బైక్ పై తిరగడం అజిత్ కి హాబీ  
  • ప్రస్తుతం రష్యాలో అదే పనిలో వున్న హీరో  

అజిత్ కి బైక్ లంటే చాలా ఇష్టం. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయన బైక్ పై చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఇక బైక్ ఛేజింగ్ కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా చేయడం ఆయనకి సరదా. ఒకవేళ బైక్ అందుబాటులో లేకపోతే ఆయన సైకిల్ ను కూడా వదలడు.

అలా స్వయంగా తాను ఒక్కడినే షికారు చేయడం ఆయనకి ఇష్టం. ఆ హాబీ కారణంగానే ఇప్పుడు ఆయన రష్యాలో బైక్ పై షికార్లు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. అజిత్ తాజా చిత్రంగా 'వలిమై' సినిమా రూపొందుతోంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ను రష్యాలో ప్లాన్ చేశారు. కొన్ని రోజులుగా అక్కడ ఈ సినిమా షూటింగును జరుపుతూ వస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయినా అజిత్ వెంటనే తిరిగి రాకుండా, బైక్ పై రష్యా అందాలను చూసి రావాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నట్టుగా చెబుతున్నారు. నవంబరులో గానీ .. డిసెంబర్లో గాని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హుమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు.

Ajith Kumar
Huma Qurshi
Karthikeya
  • Loading...

More Telugu News