YS Sunitha Reddy: సీబీఐ అధికారులతో వైఎస్ వివేకా కుమార్తె సునీత భేటీ

YS Sunitha Reddy met with CBI Officials in Kadapa

  • వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • నిన్న దాదాపు గంటపాటు సమావేశం
  • విచారణకు హాజరైన ఉదయ్‌శంకర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి నిన్న భేటీ అయ్యారు. నిన్న కడప చేరుకున్న వారు సీబీఐ అధికారులతో దాదాపు గంటపాటు సమావేశమై కేసు పురోగతిపై చర్చించారు. కాగా, ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు, యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్‌రెడ్డి నిన్న సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయ్‌ను సీబీఐ గతంలోనూ పలుమార్లు విచారించింది.

YS Sunitha Reddy
YS Vivekananda Reddy
CBI
  • Loading...

More Telugu News