Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Pooja Hegde to be cast opposite Pawan Kalyan
  • పవన్ కల్యాణ్ కి జోడీగా పూజ హెగ్డే 
  • దీపావళికి రానున్న రవితేజ 'ఖిలాడి'
  • యాక్షన్ సినిమా చేస్తున్న కల్యాణ్ దేవ్  
*  టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజ హెగ్డే త్వరలో పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కనిపిస్తోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో కథానాయిక పాత్రకు పూజ హెగ్డేను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 'హరిహర వీరమల్లు' చిత్రం తర్వాత పవన్ ఈ చిత్రాన్ని చేస్తారు.
*  రవితేజ కథానాయకుడుగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే మొత్తం షూటింగును పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తారు. కాగా, ఈ చిత్రాన్ని దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 4న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
*  మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటించే కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. దీనికి కుమారస్వామి నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి యాక్షన్ ప్రధాన చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటుగా కల్యాణ్ దేవ్ ప్రస్తుతం మరో మూడు సినిమాలు కూడా చేస్తున్నాడు.
Pooja Hegde
Pawan Kalyan
Raviteja
Kalyan Dev

More Telugu News