CM Jagan: ప్రభుత్వాసుపత్రికి వెళితే ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకం ప్రజల్లో కలగాలి: సీఎం జగన్

CM Jagan reviews health and medical department

  • వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
  • నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం
  • ఆసుపత్రుల్లో ప్రమాణాలు పెంచాలని స్పష్టీకరణ
  • తరచుగా తనిఖీలు చేయాలని నిర్దేశం

ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం, మందులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రులకు వెళితే ఆరోగ్యం కుదుటపడుతుందన్న నమ్మకం ప్రజల్లో కలగాలని అన్నారు.

ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ) ప్రమాణాలకు సరితూగే మందులు ప్రజలకు అందించాలని సూచించారు. ఇక వినాయక చవితి నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే పండుగ జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

CM Jagan
Review
Mediacal
Health
Andhra Pradesh
  • Loading...

More Telugu News