Andhra Pradesh: భూ పరిహారం ఇవ్వకపోవడంపై ఐఏఎస్​ లపై ఏపీ హైకోర్టు మండిపాటు.. ఐదుగురికి జైలు శిక్ష

AP High Court Issues Jail Punishment for Five IAS Officers

  • అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా
  • కోర్టు చెప్పినా ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం
  • శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు

ఓ మహిళ నుంచి భూమి తీసుకుని పరిహారం అందించని ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా పరిహారం చెల్లింపులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడిన కోర్టు.. ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానాను విధించింది. వారి జీతాల నుంచి కోత పెట్టి పరిహారం అందించాలని ఆదేశించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూ పరిహారం కేసుపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.

విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధించింది. నాటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాలు, ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్. రావత్ కు నెల రోజులు, ముత్యాల రాజుకు రెండు వారాలు, మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది. అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా వేసింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువునిచ్చింది. 

  • Loading...

More Telugu News