Junior NTR: 'జనతా గ్యారేజ్' కి సీక్వెల్ అంటూ ప్రచారం!
- 'ఆచార్య' విడుదల పనుల్లో కొరటాల
- నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో
- గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్'
- త్వరలోనే పూర్తి వివరాలు
ఎన్టీఆర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ఆర్ఆర్' రెడీ అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇటీవల మీడియాలో ఎన్టీఆర్ ను చూసిన అభిమానులు, 'జనతా గ్యారేజ్' సినిమాలో లుక్ కి దగ్గరగా ఆయన కనిపించడం గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కొరటాల దర్శకత్వంలో ఆయన 'జనతా గ్యారేజ్' సీక్వెల్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో 2016లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే కొరటాల శివ ఇంతవరకూ ఎప్పుడూ సీక్వెల్ చేయలేదు .. అలాగే ఎన్టీఆర్ కూడా ఆ వైపు అడుగువేయలేదు. అందువలన ఇది కేవలం రూమర్ మాత్రమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 'ఆచార్య'ను విడుదల వైపుకు నడిపించే పనిలో ఉన్న కొరటాల, త్వరలోనే ఎన్టీఆర్ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు.