Girl: పబ్ లో పదేళ్ల బాలిక... నోటీసులు ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు

Ten years old girl spotted in a Hyderabad pub

  • లాల్ స్ట్రీట్ పబ్ లోకి బాలిక ప్రవేశం
  • బాలికను తీసుకువచ్చిన ఓ కుటుంబం
  • వీడియో తీసి సీపీకి పంపిన యువకుడు
  • స్పందించిన గచ్చిబౌలి పోలీసులు

హైదరాబాదులోని ఓ పబ్ లోకి పదేళ్ల బాలికను అనుమతించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గచ్చిబౌలి పోలీసులు స్పందించారు. పబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ పబ్ లోకి ఓ కుటుంబం పదేళ్ల బాలికను కూడా తీసుకువచ్చింది.

అయితే ఓ యువకుడు పబ్ లో బాలిక ఉన్న వైనాన్ని వీడియో తీసి నగర పోలీసు కమిషనర్ కు ట్వీట్ చేశాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల లోపు వారిని పబ్ లోకి అనుమతించరాదన్న నిబంధనను పబ్ యాజమాన్యం ఉల్లంఘించినట్టు తాజా ఘటనతో వెల్లడైంది. దీనిపై వివరణ కోరుతూ పబ్ మేనేజర్ కు, యాజమాన్యానికి పోలీసులు నోటీసులు పంపారు.

Girl
Pub
Gachibowli
Police
Hyderabad
  • Loading...

More Telugu News