Jagga Reddy: ఈ నాలుగు అంశాలపై చర్చకు సిద్ధమా?: బండి సంజయ్ కి జగ్గారెడ్డి సవాల్

Jagga Reddy Challenges Bandi Sanjay

  • బీజేపీ రక్తం తాగే పులిలాంటిది
  • గోవులా కనపడుతూ హిందువులను రెచ్చగొడుతుంది
  • బండి సంజయ్ హిందుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ హిందుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల కోసం తాను లేవనెత్తే నాలుగు ప్రశ్నలకు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న 80 శాతం మంది హిందువుల కోసం పని చేస్తానని చెప్పావ్... హిందువుల కోసం మోదీతో మాట్లాడి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించగలవా? తెలంగాణలోని పేద హిందువులకు రూ. 15 లక్షలు ఇప్పించగలవా? నిజాం భూములు తీసుకుని హిందువులకు ఇస్తామని చెప్పగలవా? 80 శాతం మంది హిందువుల కోసం మాట మీద నిలబడగలవా? అని సవాల్ విసిరారు.
 
బీజేపీ రక్తం తాగే పులిలాంటి స్వభావం గలదని జగ్గారెడ్డి విమర్శించారు. పైకి గోవులా కనపడుతూనే హిందువులను రెచ్చగొడుతుందని చెప్పారు. మీకు మతాల మధ్య గొడవలు కావాలా? లేక ప్రజలకు మేలు జరగడం కావాలా? అని ప్రశ్నించారు.

Jagga Reddy
Congress
Bandi Sanjay
BJP
  • Loading...

More Telugu News