Assam: కరోనా కలకలం.. అసోంలో మళ్లీ రాత్రి పూట కర్ఫ్యూ

Night Curfew in Assam

  • పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • అసోంలో ఈ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ
  • రాత్రి 8 గంటలకే అన్నీ మూత

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం ఇంకా తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అసోంలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో తాజాగా 570 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఐదుగురు చనిపోయారు.

దీంతో, అసోం ప్రభుత్వం మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. గత వారం రోజుల్లో 10 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
 
అసోంలో ఇప్పటి వరకు 5,89,426 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,660 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,554 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రాత్రి 8 గంటల కల్లా హోటళ్లు, దాబాలు, దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Assam
Night Curfew
Corona Virus
  • Loading...

More Telugu News