Pawan Kalyan: తమిళనాడు సీఎం స్టాలిన్​ పై పవన్​ కల్యాణ్​ ప్రశంసల వర్షం

Pawan Kalyan Praises Tamilnadu CM Stalin
  • ఆయన పాలన అన్ని రాష్ట్రాలకూ ఆదర్శం
  • అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు
  • పాలన ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నారు
తమిళనాడు సీఎం స్టాలిన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాటలే కాదు.. చేతల్లోనూ పాలన ఎలా ఉండాలో చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. మీ పాలన, పనితీరు తమిళనాడు ఒక్క దానికే కాదు.. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ, రాజకీయ పార్టీలకూ ఆదర్శం, మార్గదర్శి. అంత మంచి పాలన అందిస్తున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు’’ అంటూ స్టాలిన్ ను ప్రశంసించారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)గా ఏర్పడిన ఆ పార్టీ.. 159 సీట్లను గెలుచుకుంది. ఒక్క డీఎంకేనే 133 స్థానాల్లో విజయం సాధించింది. స్టాలిన్ ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Pawan Kalyan
Janasena
Tamilnadu
Tamil Nadu
MK Stalin
DMK

More Telugu News