ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాశ్.. ఘనంగా నిశ్చితార్థం!
- అనుజతో అవినాశ్ కు నిశ్చితార్థం
- సరైన వ్యక్తి జీవితంలోకి వస్తున్నప్పుడు వేచి చూడాల్సిన అవసరం లేదన్న అవినాశ్
- త్వరలోనే వివాహం జరుగుతుందని వెల్లడి
పెళ్లి ఎప్పుడు? అని మీరందరూ తనను ఎన్నోసార్లు అడిగారని... అతి త్వరలోనే నా అనుజతో వివాహం జరుగుతుందని చెప్పాడు. ఎప్పటి మాదిరే మీ అందరి ఆశీస్సులు తనకు ఉండాలని కోరాడు.
కరోనా నేపథ్యంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు అవినాశ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీముఖి, మెహబూబ్, నోయల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.