TMC: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ బాటపడుతున్న బీజేపీ నేతలు.. కాషాయపార్టీకి బిశ్వజిత్ దాస్ గుడ్‌బై

Bengal BJP MLA Biswajit Das rejoins TMC
  • టీఎంసీలోకి కొనసాగుతున్న వలసలు
  • నిన్న టీఎంసీలో చేరిన బిశ్వజిత్ దాస్
  • 2019లో బీజేపీలో చేరిక
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు మళ్లీ టీఎంసీ బాటపడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, కిందిస్థాయి నేతలు తిరిగి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బాగ్దా ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్ కాషాయపార్టీకి గుడ్ బై చెప్పేసి టీఎంసీలో చేరారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదిరిపోయే మెజార్టీ సాధించిన టీఎంసీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరి విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఆ వెంటనే తిరిగి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న బిశ్వజిత్ టీఎంసీలో చేరారు. గతంలో ఆయన టీఎంసీ నుంచే రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.
TMC
BJP
West Bengal
Biswajit Das

More Telugu News