USA: మరీ ఇంత చెత్తగానా?: బలగాల ఉపసంహరణపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​ మండిపాటు

Trump Criticizes Biden Over Army withdrawal
  • చరిత్రలోనే లేదని బైడెన్ సర్కార్ పై ఆగ్రహం
  • చేతులెత్తేసిందని విమర్శలు
  • అత్యాధునిక ఆయుధాలు వదిలేశారని కామెంట్
  • భారీ బలగాలతో వెళ్లి తీసుకొచ్చేయాలని డిమాండ్
  • లేదంటే బాంబులేసి నాశనం చేయాలని వ్యాఖ్య
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇంత చెత్త ఉపసంహరణ చరిత్రలో ఎన్నడూ లేదని బైడెన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులను ఎదుర్కోలేక బైడెన్ సర్కార్ చేతులెత్తేసిందని విమర్శించారు. మొత్తం అత్యాధునికమైన ఆయుధాలను అక్కడ వదిలేసి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ప్రత్యేక విమానాల్లో ఆ ఆయుధాలను, వాహనాలను తీసుకొచ్చేయాలని డిమాండ్ చేశారు. 8,500 కోట్ల డాలర్ల సంపదలో ఒక్క డాలర్ ను కూడా వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. ఒకవేళ తాలిబన్లు వాటిని తిరిగివ్వకుంటే భారీ బలగాలతో అక్కడకు చేరుకుని తీసుకొచ్చేయాలన్నారు. అది చేతగాదంటే బాంబులు వేసైనా వాటిని నాశనం చేయాలన్నారు. అమెరికా ఇంత చెత్తగా వెనుదిరిగి వచ్చేస్తుందని ప్రపంచం ఊహించలేదన్నారు.
USA
Afghanistan
Taliban
Donald Trump

More Telugu News