YS Vivekananda Reddy: వివేక హ‌త్య కేసు: డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని ప్రొద్దుటూరు తీసుకెళ్లిన సీబీఐ అధికారులు

trail in viveka murder case

  • 86వ రోజు విచార‌ణ
  • రెండు నెల‌లకు పైగా ద‌స్త‌గిరిని ప్ర‌శ్నించిన అధికారులు
  • మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం  ఇవ్వ‌నున్న ద‌స్త‌గిరి

మాజీ మంత్రి దివంగత‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) 86వ రోజు విచార‌ణ కొన‌సాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు విచారిస్తోన్న విష‌యం తెలిసిందే. గత రెండు నెల‌ల నుంచీ వివేక మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని వ‌రుస‌గా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఈ రోజు కూడా అతనిని విచారించి, క‌డ‌ప నుంచి ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. సెక్ష‌న్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు ద‌స్త‌గిరి వాంగ్మూలం ఇవ్వ‌నున్నాడు. ఇప్ప‌టికే వివేక హ‌త్య‌ కేసులో అధికారు‌లు కీల‌క ఆధారాలు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. పలు కోణాల్లో అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు.  

YS Vivekananda Reddy
Crime News
Andhra Pradesh
CBI
  • Loading...

More Telugu News